- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేసీఆర్ మైండ్ పనిచేయట్లేదు.. పవర్ పోవడంతో పరేషాన్ అవుతుండు’
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌కు మైండ్ పని చేయడం లేదని టీపీసీసీ స్పోక్స్ పర్సన్ బండి సుధాకర్ గౌడ్ సెటైర్ వేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోవడంతో కేసీఆర్ పరేషాన్ అవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్దత వల్లే కరువు పరిస్థితులు మళ్లీ వచ్చాయని మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడటం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. పంట వాడిపోవడానికి, ఎండిపోవడానికి కూడా తేడా తెలియని పెద్ద రైతు కేసీఆర్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జనగామ జిల్లాలో లక్షా 80 వేల ఎకరాల్లో వరిసాగు చేయగా, అందులోని లక్ష ఎకరాల వరిపంట వారం రోజుల్లో కోయడానికి సిద్ధంగా ఉన్నదని వివరించారు. ఎక్కడా కరెంట్ పోవడం కారణంగా గుంట భూమి కూడా ఎండిపోలేదన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా, కొత్త ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కేసీఆర్ పొలంబాట అని కొత్త కథ మొదలు పెట్టాడన్నారు. అధికారం లేకపోయేసరికి కేసీఆర్‌కు రైతులు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందని సుధాకర్ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన సంగతి ఇంకా రైతులు మరిచిపోలేదన్నారు. జనగామలో 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, పంటలు ఎండిపోతే, కొనుగోలు కేంద్రాలు ఎందుకు? ఏర్పాటు చేస్తున్నారో కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని, దమ్ముంటే ఆ రైతుల వివరాలు ఇవ్వాలని బండి సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే ఇపుడే కరెంటు సరఫరా బాగున్నదని, 24 గంటల కరెంటు అంతటా ఇస్తున్నామని, ఎక్కడైనా రాలేదని కేసీఆర్ నిరూపిస్తారా ? అని సుధాకర్ గౌడ్ సవాల్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కేసీఆర్ అవాస్తవాలు ప్రచారం చేస్తూ, బద్నాం చేస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదని ఆయన హితవు పలికారు.