- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ గుణం రాహుల్ గాంధీ రక్తంలోనే ఉంది.. వీహెచ్ కీలక వ్యాఖ్యలు
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ప్రజల సమస్యలు తీరుతాయని కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎంపీ వీహెచ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో పేదల కోసమే తయారు చేశారని, రాహుల్ గాంధీ రక్తంలోనే పేదల గురించి ఆలోచించే గుణం ఉందని వీహెచ్ వెల్లడించారు. బీజేపీ మరోసారి మతం పేరుతో ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోందని విమర్శంచారు. బీజేపీ విద్వేషంతో రాజకీయాలు చేస్తుంటే.. రాహుల్ ప్రేమతో రాజకీయం చేస్తున్నాడని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- బీజేపీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి బీఆర్ఎస్ కనిపించదన్నారు. కేసీఆర్ అహంకారమే ఆ పార్టీకి నష్టం చేస్తున్నదని మరోసారి గుర్తుచేశారు.
Advertisement
Next Story