- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్.. పీఏసీలో సుదీర్ఘ చర్చ
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ ఏర్పాటు చేసిన పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ మీటింగ్ సుదీర్ఘంగా జరిగింది. సోమవారం గాంధీభవన్‌లో 3 గంటలు పాటు కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో పాటు పీఏసీ సభ్యులు ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశంలో ప్రధానంగా మూడు తీర్మానాలు చేయగా, వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజా సంఘాలు, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పార్టీ విజయానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశ పెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.
దీంతో పాటు ఏఐసీసీ నాయకులు, కర్ణాటక మంత్రులు, ఇతర రాష్ట్రాల్లోని అబ్జర్వర్లు ఇక్కడే మకాం వేసి ఎన్నికలకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం చేశారు. అంతేగాక ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీకి తెలంగాణలో పార్లమెంట్‌కు పోటీ చేయించాలని, లేదా రాజ్యసభకు తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కోరుతూ సీఎం, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన తీర్మానాన్ని సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు.
తీర్మానాలు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన, పార్టీ యాక్టివిటీస్ నిర్వహణపై నేతలంతా సుదీర్ఘంగా చర్చించారు. పది రోజుల పాలనలో మార్పులు, భవిష్యత్ లో చేయాల్సిన కార్యక్రమాలపై ఓ ప్రణాళికను రూపొందించనున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం వ్యవసాయం, ఆర్థిక, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రం చేయనున్నారు. అంతేగాక మిషన్ భగీరథ అవకతవకలపైనా ఎంక్వైరీ వేయాలని పార్టీలో నిర్ణయం తీసుకున్నారు.
పార్లమెంట్ ఇన్ చార్జ్‌లు :
చేవెళ్ల, మహబూబ్‌నగర్– రేవంత్ రెడ్డి
సికింద్రాబాద్, హైదరాబాద్– భట్టి విక్రమార్క
మహబూబాబాద్, ఖమ్మం– పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నాగర్‌కర్నూల్– జూపల్లి కృష్ణారావు
నల్గొండ– ఉత్తమ్ కుమార్ రెడ్డి
భువనగిరి– కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వరంగల్– కొండా సురేఖ
ఆదిలాబాద్– సీతక్క
పెద్దపల్లి– శ్రీధర్ బాబు
కరీంనగర్– పొన్నం ప్రభాకర్
నిజామాబాద్– జీవన్ రెడ్డి
జహీరాబాద్– పి. సుదర్శన్ రెడ్డి
మెదక్– దామోదర రాజనర్సింహ
మల్కాజిగిరి– తుమ్మల నాగేశ్వరరావు