- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ న్యూస్: 111 జీవో రద్దుపై T- కాంగ్రెస్ సంచలన నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో: 111 జీవో ఎత్తివేత అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ అంశంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. త్రిబుల్ వన్ జీవో ఎత్తివేత్తపై ఏడుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జీవో ఎత్తివేత, పరిణామాలపై అధ్యయనం చేసి పార్టీ పెద్దలకు నివేదిక సమర్పించనుంది. జీవో రద్దుతో జంట జలాశయాలకు నష్టం కలుగుతుందని కాంగ్రెస్ వాదిస్తోంది. అలాగే ఈ జీవో పరిధిలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని అధికార పార్టీ నేతల చేతుల్లోకి భూములు వెళ్లిన తర్వాతే ఈ జోవోను ప్రభుత్వం రద్ధు చేసిందని ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో త్రిబుల్ వన్ జీవో వెనుక ఉన్న మతలబు ఏంటి? ఈ జీవో ఎత్తివేయడం ద్వారా చెరువు ధ్వంసం ఏ విధంగా ఉండనుంది అనేది ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదికను పార్టీ పెద్దలకు సమర్పించనుంది. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో కోదండరెడ్డితో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలు ఉన్నారు.
Also Read...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ORR స్కామ్ వెయ్యి రెట్లు పెద్దది: రేవంత్ రెడ్డి