- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ లవ్ బీఆర్ఎస్! కాంగ్రెస్ పార్టీ ఆసక్తికర ట్వీట్..
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి రహస్య సంబంధం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించింది. ‘నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు.. కష్టాలు ఎవరికీ ఊరికే రావు, కాంగ్రెస్‌కు అధికారమిస్తేనే వస్తాయి’ బీజేపీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తిరిగి కౌంటర్ ఇచ్చింది. బీఆర్ఎస్ లవ్ బీజేపీ అని విమర్శించింది. దోపిడీ దోస్తిదే ఈ పాపం అని, అప్పుడు నీళ్ళకు అవార్డులు ఇచ్చి.. ఇప్పుడు నీళ్ళు లేవని నీల్గితే ఎట్లా అని బీజేపీని ప్రశ్నించింది. నాదనేది నీదేనోయ్.. నీదనేది నాదేనోయ్ అంటూ ఆసక్తికర ట్వీట్ చేసింది.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ట్వీట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరో మోసం.. సబ్సిడీ గ్యాస్ సగం మందికేనని తెలిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారందరికీ రూ.500లకే వంటగ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, తీరా అమలు సమయంలో అనేక షరతులు విధించిందని తెలిపింది. అది కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొంటేనే అంటూ మెలికపెట్టారని పేర్కొంది. తెలంగాణలో సుమారు 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే 40 లక్షల మందికే సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నారని వెల్లడించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తిరిగి కౌంటర్ ఇచ్చింది. ప్రతి పేదవాడికి ఆరు గ్యారంటీల ప్రయోజనాలను అందించే దాకా ఈ ప్రజా ప్రభుత్వం నిద్రపోదని, దగాకోరు దోస్తులు (బీఆర్ఎస్-బీజేపీ) మాటలు నమ్మి ఆగం కావొద్దని సూచించింది.