- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదా.. KTR ట్వీట్‌కు కాంగ్రెస్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వేలాది మంది అమరులు అయింది ఎవరి వల్ల అంటూ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అవుతూ ఓ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ట్వీట్ చేసింది. ‘తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ గారి వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని చెప్పిన గత ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిన తర్వాత సోనియా గాంధీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం సభ్యులు ఎవరు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష డ్రామా చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం కోసం సబ్బండ వర్గాల ప్రజలు రోడ్లమీదకు వస్తే పెట్రోల్ బాటిల్ పట్టుకుని అగ్గిపుల్ల గీయకుండా డ్రామా చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ పోరాటం చేస్తుంటే దీక్ష విరమణ చేసి హాస్పిటల్ లో జ్యూస్ తాగింది ఎవరు అని ప్రశ్నించింది.
తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన తొలి అమరుడు శ్రీకాంత్ చారి కుటుంబానికి అన్యాయం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం కోసం అమరులు అయిన సభ్యుల వివరాలు లేవని కొంతమంది వివరాలు మాత్రమే ఉన్నాయని చెప్పింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఎంతోమంది ఉండగా ఒకే కుటుంబంలో 5 మందికి పదవులు ఇచ్చింది ఎవరు? తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత రైతులకు భేడీలు వేసి జైలుకు పంపింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే దళితుడు తొలి ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ముస్లీం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇవ్వకుండా 10 ఏళ్ళు మోసం చేసింది ఎవరు అని క్వశ్చన్ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి 10 ఏళ్లు మోసం చేసింది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో మీరు దోచుకున్న భూములను, దోపిడీ సొమ్మును అన్నీ లెక్కలతో సహా కక్కిస్తాం. మిస్టర్ కేటీఆర్ నువ్వు నీ తండ్రి 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజలను మోసం వేసిన తీరు ఒకసారి గుర్తు చేసుకో... తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన నీకు బుద్ది రాకపోతే ఎలా!? మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మేము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం మా లక్ష్యం సుభిక్షమైన తెలంగాణ.’ అని ట్వీట్ చేసింది.