- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోండి
దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్, మాజీ మంత్రి కేటీఆర్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిలపై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని బూత్ నెంబర్ 30 గూడూరు గ్రామంలో ‘‘ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్”అంటూ ఈటల మాట్లాడారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లేనని కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేట్ కమిటీ చైర్మన్ జీ నిరంజన్ లిఖిత పూర్వకంగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. అదే విధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బర్కత్ పూర నియోజకవర్గంలో నరేంద్ర మోడీని పేరును తీసుకుంటూ ప్రస్తావించారని, ఇదీ ఎంసీసీ ఉల్లంఘనే అని కంప్లైంట్ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోని జూబ్లీహిల్స్ నంది హిల్స్ పోలింగ్ స్టేషన్ లో ‘‘తెలంగాణ తెచ్చిన పార్టీ, లీడర్ కు” ఓటేయాలని కోరారని, ఇది కూడా కోడ్ ను బ్రేక్ చేసినట్లేనని నిరంజన్ వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.