- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌తో పొత్తుపై కాంగ్రెస్ క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్పార్టీ పొత్తు పెట్టుకోదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ క్లారిటీ ఇచ్చారు. మిగత పార్టీ లతో పొత్తు విషయాలను పరిశీలిస్తామన్నారు. వివిధ రాష్ట్రాలలో వివిధ పార్టీ లతో పొత్తు ఉన్నదని, వామపక్షాలతోనూ ఉన్నందున పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నదన్నారు. గాంధీభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కవిత ధర్నా చేయడం హాస్యాస్పదం అన్నారు.తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కవిత వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక తెలంగాణ లో భూమి సమస్యలు చాలా ఉన్నాయని, వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ పంచ సూత్రలను తయారు చేసిందన్నారు. 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ధరణి అదాలత్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో సంపూర్ణ సమగ్ర భూ సర్వే జరుపుతామన్నారు. రాష్ట్రంలోని 15 లక్షల మంది కౌలు రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జీ థాక్రే మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సరైన న్యాయం చేయడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉండేందుకు పోరాటం చేస్తుందన్నారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం ఉన్నదని, అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ధరణికి శాశ్వత పరిష్కారం తెస్తామన్నారు.