Job calendar : జాబ్ క్యాలెండర్‌పై యువతకు కాంగ్రెస్ కీలక భరోసా!

by Ramesh N |
Job calendar : జాబ్ క్యాలెండర్‌పై యువతకు కాంగ్రెస్ కీలక భరోసా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాబ్ క్యాలెండర్ 2024-25 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తాజాగా ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసింది. ప్రజా ప్రభుత్వంలో అమరవీరుల ఆశయాలు ఆచరణలోకి వస్తున్నాయని పేర్కొంది. నాడు తెలంగాణ ప్రజల మొదటి లక్ష్యం.. ప్రత్యేక రాష్ట్ర సాధన కాంగ్రెస్ తోనే సాధ్యం అయిందని గుర్తుచేసింది. నేడు తెలంగాణ ప్రజల రెండవ లక్ష్యం.. రాష్ట్ర పునర్నిర్మాణం కూడా కాంగ్రెస్ తోనే నెరవేరబోతుందని వెల్లడించింది.

అందులో భాగంగానే దశాబ్ద కాలంగా ఇంటికి దూరంగా, చాలి చాలని డబ్బులతో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతూ, గత ప్రభుత్వ తప్పిదాలతో నిరాశ, నిస్పృహలకు గురి అయిన యువతకు జీవం పోస్తూ జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం ప్రకటించిందని పేర్కొంది. ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం ఇక పై ఎదురు చూపులు అవసరం లేదని, సమయానికి ఉద్యోగాలు భర్తీ చేయబడతాయని, యువత కలలు నెరవేరుతాయని హామీ ఇచ్చింది.

Advertisement

Next Story