- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోక్‌సభలో మరో 50 మంది ఎంపీలు సస్పెండ్.. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ కీలక పిలుపు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో మళ్లీ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఎంపీల సస్పెన్షన్‌తో ఉభయ సభలు సజావుగా నడవలేని పరిస్థితి నెలకొంది. ఈ సెషల్‌లో మొత్తం 142 మంది ఎంపీలపై చైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలకు కీలక మెసేజ్ పంపించారు. ఎంపీలంతా ఉన్నపళంగా వెనక్కి వచ్చేయాలని ఆదేశించారు.
కాగా, లోక్‌సభలో మొత్తం 96 మంది ఎంపీలు, రాజ్యసభలో 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. తాజాగా.. ఇవాళ మరో 50 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే, ఇవాళ సభలు ప్రారంభం కాగానే సస్పెన్షన్‌లను నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో 50 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. దీంతో సభలో మళ్లీ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది.
Advertisement
Next Story