మేడిపల్లి ఎస్‌ఐ పై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు.. కారణం ఇదే..

by Indraja |   ( Updated:2024-02-02 05:47:41.0  )
మేడిపల్లి ఎస్‌ఐ పై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు.. కారణం ఇదే..
X

దిశ డైనమిక్ బ్యూరో: బాధ్యతాయుత కొలువులో ఉండి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు మేడిపల్లి ఎస్‌ఐ అని కానిస్టేబుల్ నాగమణి ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తన ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ మేడిపల్లి పోలీసులను ఎన్నిసార్లు ఆశ్రయించిన పట్టించుకోవడం లేదని మహిళా కానిస్టేబుల్ నాగమణి ఆరోపించారు. మేడిపల్లి ఎస్‌ఐ శివకుమార్ కబ్జాదారులతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర లంచం తీసుకున్నారని.. అందుకే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఈ ఏడాది జులై నుండి పోలీస్ స్టేషన్ చుట్టు తిరుగుతున్న ఎవరు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. అయితే నిందితుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్లకు బెయిల్ ఇప్పించారని, అలానే స్టే కూడా ఇప్పించారని పేర్కొన్నారు. కానీ తన ఫైల్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఇక ఆ రోజు జరిగిన గొడవ గురించి ఫిర్యాదు చేస్తే తన ఫిర్యాదును కేవలం ఫిటీషన్ మాత్రమే చేశారని.. కానీ కబ్జాదారుల ఫిర్యాదును మాత్రం ఎఫైఆర్ చేశారని ఎందుకు ఈ వివక్షత అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలానే ఫిర్యాదు చేసినప్పుడే తాను సీసీ టీవీ ఫుటేజ్ చూపిస్తే ఆ సీసీ టీవీ ఫుటేజ్ ను ఎస్‌ఐ పరిశీలించారని తెలిపారు.. ఇప్పుడు ఆ సీసీ టీవీ ఫుటేజ్ ఏమైంది..? ఎక్కడుంది అని మీడియా ద్వారా ఎస్‌ఐను ప్రశ్నించారు. వీడియో గురించి ఎస్‌ఐ శివకుమార్ తో మాట్లాడితే వీడియొ లేదు ఏం లేదు నీకు ఇష్టమొచ్చినట్లు చేసుకోమన్నారని నాగమణి వెల్లడించారు.

ఇక తన తల్లి 3 వ తేదీ పోలీస్ స్టేషన్ కి వచ్చారని శివకుమార్ అంటున్నారని.. అదే నిజమైతే ఆ వీడియో తియ్యండి అని.. అలానే తాను కూడా తన దగ్గర ఉన్న నాలుగు సీసీ టీవీల ఫుటేజ్ ను తాను తీస్తాను అని ఎస్‌ఐ శివకుమార్ కు సవాల్ విసిరారు. తాను, తన భర్త కట్టెలతో కొట్టమని ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికెట్ పెట్టుకొని తమను రిమాండ్ చెయ్యాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అలానే ఇది కేవలం ఎస్‌ఐ శివకుమార్ దౌర్జన్యం అని, కక్ష, పాత కక్ష అని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు కనీసం తనని పిలిచి మాట్లాడలేదని.. మినిమం ఎంక్వయిరీ కూడా జరగలేదు అని మండిపడ్డారు. ఈ ఎస్‌ఐ కి ఎవరు ట్రయినింగ్ ఇచ్చారు..? అయన చదువుకోలేదా..? నేను కేవలం మహిళా కానిస్టేబుల్ ని.. నాకున్న నాలెడ్జ్ కూడా ఆయనకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక దేని ఆధారంగా ఎంక్వయిరీ చేశారు..? నేను కొట్టనా..? నా భర్త కొట్టారా..? ఇద్దరం కలిసి కొట్టమని చెప్పినప్పుడు నన్ను వదిలేసి నా భర్తను మాత్రమే ఎలా మెడికల్ ఎక్సామినేషన్ కి పంపుతారు..? అని కానిస్టేబుల్ నాగమణి ప్రశించారు. ఈ పోలీస్ స్టేషన్ లో అంత అన్యాయంగా నడుస్తోందని ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతముందు తాను డీసీపీకి, సిఐకి, సీపీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని.. అయితే ఆ కంప్లైంట్ సీపీ వరకు వెళ్లిందో లేదో తనకు తెలియదని నాగమణి పేర్కొన్నారు. సీపీని కలవాలని ఆఫీస్ కి వెళ్లిన సీపీని కలవకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. యూనిఫామ్ వేసుకున్న తన పరిస్థితే ఇలా ఉంటె సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అని ప్రశించారు..? తనకు న్యాయం జరగకపోతే సాధారణ ప్రజలకు న్యాయం జరిగే అవకాశమే లేదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed