- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రి మల్లారెడ్డి నిర్మాణాలనూ కూల్చండి.. సీఎం రేవంత్‌కు కమ్యూనిస్టు నేత స్పెషల్ రిక్వెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) అధికారులు కూల్చివేసిన ఎన్ కన్వెన్షన్‌ను సీపీఐ నేత నారాయణ ఆదివారం పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. హైడ్రా ఏర్పాటు మంచి పరిణామం అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ చేయలేని పనులను.. రేవంత్ రెడ్డి చేసి చూపిస్తున్నాడని ప్రశంసించారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలను, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాలను సైతం కూల్చివేయాలని సీఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా అధికారులకు ప్రత్యేకంగా నారాయణ విజ్ఞప్తి చేశారు.
అక్కినేని నారార్జున బిగ్‌బాస్‌కే బిగ్బాస్లా మారారని విమర్శించారు. దొంగ పట్టాలు సృష్టించి చెరువును కబ్జా చేశారని ఆరోపించారు. ఇప్పుడు పీకల మీదకు వచ్చాక.. సినిమా డైలాగులు కొడుతున్నాడని ఎద్దేవా చేశారు. కేవలం కూల్చివేసి వదిలేయొద్దు అని.. నాగార్జున నుంచి పదేళ్ల అద్దె వసూలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బుసలు కొట్టినా, తరువాత సైలెంట్ అయిందనంటూ సెటైర్లు వేశారు. అక్కినేని నాగార్జున మంచి నటుడు కావచ్చు. కానీ కక్కుర్తి ఎందుకు అని ప్రశ్నించారు. జీవితం అంటే సినిమా డైలాగులు కొట్టడం కాదని, ఇప్పటికైనా బుకాయింపు మాటలు వద్దు అని హితవు పలికారు. ఆక్రమించి చేపట్టిన నిర్మాణం కనుక ప్రజలకు నాగార్జున క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.