MBNR: విద్యార్థులతో కలిసి డిన్నర్ చేసిన కలెక్టర్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-02 16:16:44.0  )
MBNR: విద్యార్థులతో కలిసి డిన్నర్ చేసిన కలెక్టర్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: వసతి గృహాల్లో భోజన నాణ్యతలో రాజీ పడవద్దని, ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. సోమవారం ఆమె తన క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని గదుల ఫ్లోరింగ్ రిపేర్‌కు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హాస్టల్ గదులు, స్టోర్ రూం, వంట గది, పరిసరాలను పరిశీలించి, అన్నింటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆమె విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. కలెక్టర్ వెంట వసతి గృహం సంక్షేమ అధికారి మాధవి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed