CM Revanth Reddy : మూసీ పరివాహక ప్రాంతాన్ని చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

by M.Rajitha |   ( Updated:2024-11-08 13:02:42.0  )
CM Revanth Reddy : మూసీ పరివాహక ప్రాంతాన్ని చూస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మూసీ నదీ పరివాహక ప్రాంతంలో 'మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర' (Musi Sankalpa Padayatra) చేపట్టారు. పాదయాత్ర అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రజలతో మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మూసీ నీళ్ళ వల్ల పంటలు, కూరగాయలు విషం అయ్యాయని.. ఈ ప్రాంతంలో పండిన పంటలు ఎవరూ కొనడం లేదు. రైతులు ఉన్న పొలాలు, భూములు అమ్ముకుంటున్నారు. అన్ని రాజకీయ ఎజెండాలు పక్కన పెట్టి మూసీ బాగుకోసం అన్నిపార్టీల నాయకులు ముందుకు రావాలి. బీఆర్ఎస్, బీజేపి నాయకులకు మూసీ ప్రక్షాళన కావడం ఇష్టం లేదు. అందుకే ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు.

మూసీ నది హైదరాబాద్(Hyderabad) కు అణుబాంబు కంటే ఎక్కువ ప్రమాదంగా తయారైంది. మేము మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు, పంట పొలాల గురించి ఆరాట పడుతుంటే.. మూసీ ప్రాజెక్టులో కమిషన్లు అంటూ బురద జల్లుతున్నారు. కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. మోడీ గంగానది ప్రక్షాళన చేయవచ్చు గాని, మేము మూసీని బాగు చేసుకోవద్ద అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నేడు నేను చేసిన పాదయాత్ర వలన నా జన్మధన్యం అయింది అన్నారు. పదేళ్ళు తెలంగాణను విధ్వంసం చేసిన వాళ్ళు.. మేము నల్గొండని కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం బుల్డోజర్లకు అడ్డం పడతామని అంటున్నారు. ఎవ్వరూ అడ్డువచ్చినా ప్రక్షాళన ఆగదు అన్నారు. ఈరోజు నేను మాట్లాడిన వివిధ వర్గాల ప్రజలు నాకు స్వయంగా దైర్యం చెప్పారు.. మూసీ ప్రక్షాళన చేయండి మీకు అండగా మేము ఉంటామన్నారు. ఈరోజు పాదయత్ర ట్రైలర్ మాత్రమేనని, అసలు స్టోరీ జనవరిలో ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed