దమ్ము ఉంటే టచ్ చేయండి.. మేం తల్చుకుంటే ఫామ్‌హౌజ్ గోడలు కూడా ఉండవు: CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-03-09 15:03:34.0  )
దమ్ము ఉంటే టచ్ చేయండి.. మేం తల్చుకుంటే ఫామ్‌హౌజ్ గోడలు కూడా ఉండవు: CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సర్కార్‌ కూలిపోతుందన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మేడ్చల్‌లో కాంగ్రెస్ శనివారం ప్రజాదీవెన సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంపూర్ణ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది.. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని కొందరు అంటున్నారు. మా ప్రభుత్వాన్ని కూలగొట్టే దమ్ము ఎవరికైనా ఉందా..? దమ్ముంటే మమ్మల్ని టచ్ చేసి చూడండి. మేం మంచి వాళ్లం కాబట్టి మీరు ఇంకా తిరుగుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఫామ్ హౌజ్ గోడలు కూడా ఉండవు. మేం మర్యాదస్తులం కాబట్టి మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు’ అని బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పేద బిడ్డ సీఎం కుర్చీలో కూర్చుంటే కొందరికి కడుపు మండుతోందని.. దోచి దాచుకున్న డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని అన్నారు. ధర్నా చౌక్ వద్దన్న వాళ్లే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ధర్నాచౌక్ వద్ద ధర్నాలు చేయనిచ్చారా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story