- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహ శంఖుస్థాపనపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: శంఖుస్థాప కార్యక్రమం మరపురాని ఘట్టమని, మట్టి బిడ్డగా ఈ అదృష్టం నాకు దక్కిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ శంఖుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నాలుగు కోట్ల ప్రజల మనోఫలకం పై కొలువైన నిలువెత్తు రూపం, నా తల్లీ తెలంగాణమా అని ప్రతి గుండె వినిపించే శబ్ధం “తెలంగాణ తల్లి” అని తెలిపారు. అలాగే రాష్ట్ర పరిపాలన కేంద్రం సచివాలయ ప్రాంగణం ఆ తల్లి కొలువయ్యేందుకు వేదికైందని చెబుతూ.. ఈ మట్టి బిడ్డగా తెలంగాణ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించే అదృష్టం నాకు దక్కిందని చెప్పారు. ఈ జన్మలో మరువలేని మరపురాని ఘట్టం ఈ శంకుస్థాపన మహాకార్యమని రేవంత్ రెడ్డి ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా డిసెంబర్ 9 లోగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే బుధవారం సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు సహా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.