- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy : హరీశ్ రావు రాజీనామా చాలెంజ్ పై సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయంలో ఈ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతున్నామన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావుపై పరోక్షంగా రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఆనాడు సవాల్ విసిరిన వారికి ఒకటే విజ్ఞప్తి.. మిమ్మల్ని రాజీనామా చేయమని కోరము. ఎందుకంటే మీరు ఎలాగు పారిపోతారు. కానీ ఇకనైనా కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుందని, రాజకీయ ప్రయోజనాల కోసం మీలాంటి మోసపూరిత మాటలు గాంధీ కుటుంబం చెప్పదని మీరు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒకరేమో గుజరాత్ మోడల్ అని మరొకరు ఇంకేదో మోడల్ అంటున్నారు. కానీ ఈ దేశంలోని కోట్లాది మంది రైతులకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలవబోతున్నదన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి 8 నెలల లోపే రైతులకు ఏక కాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి దేశంలోనే తల ఎత్తుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. తన సుదీర్ఘ 16 ఏళ్ల రాజకీయ జీవితంలో లక్షలాది మంది రైతులకు రుణమాఫీ చేసే గొప్ప అవకాశం నాకు దక్కింది. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ మాటంటే శిలాశాసనం వంటిదని చెప్పారు రుణమాఫీకి కొలబద్ధ పాస్ పుస్తకం మాత్రమే. రేషన్ కార్డు, ఇతర కార్డులు కాదు అన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణకు కేసీఆర్ వెళ్తూ వెళ్తూ రూ.7 లక్షల కోట్లు అప్పు ఇచ్చి వెళ్లారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు తమ ప్రభుత్వం ప్రతి నెల రూ.7 వేల కోట్ల వడ్డీ కడుతున్నారని చెప్పారు.
హరీశ్ రావు ఏమన్నారంటే..
కాగా మొన్నటి లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో సీఎం ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించగా ఇది నెరవేరిస్తే తాను తన పదవికి రాజీనామాచేస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు చాలెంజ్ విసిరారు. ప్రస్తుతం ప్రభుత్వం రుణమాఫీ మొదలు పెట్టడంతో హరీశ్ రావు రాజీనామాకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నేతల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సైతం హరీశ్ రావు చాలెంజ్ పై స్పందించారు. కాగా తాను చేసిన సవాల్ పై ఇటీవలే స్పందించిన హరీశ్ రావు రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలను చెప్పిన ప్రకారం వంద రోజుల్లో అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానన్నానని కావాలంటే తన పాత వీడియోలు చూసుకోవాలని చెప్పారు.