Young India Sports University : యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

by M.Rajitha |   ( Updated:2024-10-25 14:26:46.0  )
Young India Sports University : యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్... యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ (Young India Sports University). తెలంగాణ క్రీడా విధానానికి (Sports policy) సంబంధించిన ఫైన‌ల్ డ్రాఫ్ట్‌ను న‌వంబ‌రు నెలాఖ‌రులోగా సిద్ధం చేయాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. మ‌నం రూపొందించే పాల‌సీ దేశంలోనే అత్యుత్తమ పాల‌సీగా ఉండాల‌ని, అందుకు విస్తృత అధ్యయ‌నం, నిపుణులు, క్రీడాకారుల‌తో విస్తృత స్థాయిలో సంప‌ద్రింపులు చేయాల‌ని సూచించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న క్రీడా వ‌న‌రుల‌ను స‌మ‌ర్థంగా వినియోగించుకోవాల‌ని, ఇప్పటికే ఉన్న స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల‌ను ఆధునిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాల‌ని సూచించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ (Young India Sports University)కి సంబంధించిన బిల్లు సాధ్యమైనంత త్వర‌గా రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. తెలంగాణ స్పోర్ట్స్ పాల‌సీలో భాగ‌మైన యంగ్ ఇండియా ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ (YIPESU), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడ‌మీ(YISA), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు(SATG) సంబంధించి ప‌లు వివ‌రాల‌ను ముఖ్యమంత్రికి అధికారులు వివ‌రించారు. అందులో చేయాల్సిన మార్పులు చేర్పుల‌ను సీఎం వారికి సూచించారు.

త‌న ద‌క్షిణ కొరియా ప‌ర్యట‌న సంద‌ర్భంగా అక్కడి కొరియా నేష‌న‌ల్ స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీని సంద‌ర్శించిన సంద‌ర్భంగా గుర్తించిన అంశాలను తెలియ‌జేశారు.. రెండు రోజుల క్రితం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పొన్నం ప్రభాక‌ర్‌, ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి ద‌క్షిణ కొరియా క్రీడా వ‌ర్సిటీ ప్రతినిధుల‌తో చ‌ర్చించిన అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. ద‌క్షిణ కొరియా క్రీడా వ‌ర్సిటీతో పాటు క్రీడా రంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమైన‌దిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ యూనివ‌ర్సిటీ అన‌స‌రిస్తున్న విధానాల‌పై అధ్యయ‌నం అధికారుల‌కు తెలిపారు. మ‌రో ప‌ది రోజుల్లోనే స్పోర్ట్స్ పాల‌సీకి సంబంధించిన గ‌వ‌ర్నింగ్ బాడీని ఖ‌రారు చేయాల‌ని సీఎం ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడా పోటీల‌కు సంబంధించిన క్యాలెండ‌ర్ ను వెంట‌నే త‌యారు చేయాలన్నారు. వ‌చ్చే రెండేళ్లలో నేష‌న‌ల్ గేమ్స్ కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చేలా ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్ ను సంప్రదించాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు. స‌మీక్షలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు(క్రీడ‌ల) ఏపీ జితేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివ‌సేనా రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శి షాన‌వాజ్ ఖాసీం, ఓఎస్డీ వేముల శ్రీ‌నివాసులు, రాష్ట్ర క్రీడ‌ల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.



Advertisement

Next Story

Most Viewed