- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెయ్యి ఎకరాలు గుర్తించాలి.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్‌కు బయట, రీజినల్ రింగ్ రోడ్‌కు లోపల నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు 500 నుంచి 1000 ఎకరాలు గుర్తించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయాలకు, జాతీయ, రాష్ట్ర రహదారులకు 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలన్నారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమలకు సేకరించే భూములు బంజరు భూములు, సాగుకు యోగ్యం కానివిగా ఉండాలన్నారు. దీంతో రైతులకు నష్టం కలుగకుండా కాలుష్యం తక్కువగా ఉండి, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేవిధంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఎన్ని కంపెనీలకు, ఎన్ని ఎకరాల భూమి కేటాయించారు?.. ఆభూముల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారు? వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలన్నారు.
పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత నివ్వాలని, హైదరాబాద్ లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామిక వాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు. బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై మధ్య ప్రాచ్య, యూరోపియన్ దేశాలలో అమలులో ఉన్న విధానాలపై అధ్యయనం చేయాలన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. పరిశ్రమలకు ధర్మల్ విద్యుత్ వినియోగం కాకుండా సోలార్ పవర్‌ను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని గ్రామాలను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ తగు ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. బాలానగర్‌లోని ఐడీపీఎల్ భూముల పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్, సీఎంఓ అధికారులు శేషాద్రి, శివధర్ రెడ్డి, షా-నవాజ్ కాసీం తదితరులు పాల్గొన్నారు.