CM Revanth Reddy: మహిళల రక్షణలో రాజీపడబోం.. సీఎం రక్షాబంధన్ సందేశం

by Prasad Jukanti |   ( Updated:2024-08-19 15:32:42.0  )
CM Revanth Reddy: మహిళల రక్షణలో రాజీపడబోం.. సీఎం రక్షాబంధన్  సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీక, కుటుంబాల్లో ఐకమత్యాన్ని చిహ్నం అయిన రక్షాబంధన్ వేడుగలను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అక్కా చెల్లెళ్లందరికీ ఈ ప్రజా ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, మహిళల రక్షణ, సంక్షేమం, సాధికారత విషయాల్లో ఎక్కడా రాజీపడబోమని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం పలు కార్యకర్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ తో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగినంత చేయుతను అందింస్తున్నది.

Read More..

Seetakka: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క

Advertisement

Next Story

Most Viewed