- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలేరులో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా చిగురుటాకులా వణికిపోయిన సంగతి తెలిసిందే. కాగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పాలేరుకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాలేరు రిజర్వాయర్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ఆదివారం ఉదయం వరద ధాటికి కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే నాయకునిగూడెం వద్ద కొట్టుకుపోయిన ప్రధాన రహదారిని పరిశీలించారు. కాగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా రూ.5 వేల కోట్ల ఆస్తినష్టం జరిగినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా ఖమ్మంలో వరద తీవ్రత అధికంగా ఉందని తెలిపారు. తక్షణ సహాయం కింద కలెక్టర్ కు రూ.5 కోట్లు జమ చేశామని వెల్లడించారు. ఖమ్మం పట్టణానికి రాబోవు ఉపద్రవాన్ని ప్రభుత్వం ముందే ఊహించింది అని తెలిపిన సీఎం.. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ పనులు మొదలు పెట్టమన్నారు. కాని అది పూర్తి కాక ముందే గతంలో ఎన్నడూ లేనంత భారీ వరద వచ్చిందన్నారు. ప్రస్తుతం మీరు చాలా కష్టాల్లో ఉన్నారని, ప్రభుత్వం అన్ని విధాలా వరద బాదితులను ఆదుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.