సీఎం రేవంత్ రెడ్డి తో మాదిగ ఎమ్మెల్యేల భేటీ.. కేబినెట్ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఙప్తి!

by Mahesh |   ( Updated:2024-07-29 13:32:50.0  )
సీఎం రేవంత్ రెడ్డి తో మాదిగ ఎమ్మెల్యేల భేటీ.. కేబినెట్ విస్తరణలో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఙప్తి!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేల కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తో మాదిగ ఎమ్మెల్యేలు శామ్యూల్, కవ్వంపల్లి సత్యనారాయణ..వేముల వీరేశం, లక్ష్మీకాంతరావు, అడ్లూరి లక్ష్మణ్ భేటీ అయ్యారు. త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుందనే ఉహాగానాలు ఉండటంతో.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కేబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలని వారు సీఎం రేవంత్ కు విజ్ఙప్తి చేసినట్లు తెలుస్తుంది. కాగా ఎమ్మెల్యేల వినతికి సీఎం రేవంత్ కూడా సానుకూలంగా స్పందించి.. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్‌ను కలవాలని సూచించనట్లు తెలుస్తుంది. ఒకవేళ అధిష్టానం సహకరిస్తే ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే ఉత్కంఠ కూడా ఎమ్మెల్యేలలో నెలకొంది.

Advertisement

Next Story