- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
CM Revanth Reddy : SLBC పాపం కేసీఆర్ దే : సీఎం రేవంత్ రెడ్డి

దిశ, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్(Nagar Karnool) జిల్లా దోమలపెంట సమీపంలో జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదస్థలానికి(SLBC Tunnel Incident) ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేరుకున్నారు. ప్రమాదంపై, రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రులను, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 వేల క్యూసెక్కులు, 30 టీఎంసీల నీటిని గ్రావిటేషన్ పద్ధతిలో నల్గొండ(Nalgonda), మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లాల తాగు నీటి అవసరాలు తీర్చడానికి 2005లో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్ట్(SLBC) మొదలు పెట్టారని తెలిపారు. అప్పటి నుంచి 2014 వరకు దాదాపు 32 కిమీల టన్నెల్ పూర్తి చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు పూర్తయ్యి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల సమస్యకు పరిష్కారం చూపిస్తుందని అభిప్రాయపడ్డామన్నారు.
కాని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్(BRS) ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి, కనీసం విద్యుత్ ఛార్జీలు చెల్లించకపోతే.. కరెంట్ సరఫరా నిలిపివేశారని అన్నారు. దీంతో 10 ఏళ్లు ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగ తీసుకొని టన్నెల్ బోర్ రిపైర్ పనులు క్లియర్ చేసి పనులు మొదలు పెట్టామని, కాని అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ఖచ్చితంగా కేసీఆర్(KCR) దేనని సీఎం మండిపడ్డారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు 11 సంస్థలు ఈ రెస్క్యూలో పని చేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా మీడియాకు, విపక్షాలు దీనిని రాజకీయం చేయకుండా సమస్య పరిష్కరించేందుకు సహకరించాలని కోరారు. ప్రమాదం జరిగిన గంటలోనే మంత్రులు ఉత్తమ్, జూపల్లి ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారని తెలిపారు.
లోపల బోర్ టీబీఎం మిషన్ విరిగిపోయిందని, తవ్వకాలలో మట్టిని బయటికి చేరవేసే కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదన్నారు. నీరు, బురద ఉధృతంగా ఉండటం వలన రిపేర్ పనులకు కొంత ఆటంకం కలుగుతోందని అన్నారు. మరో రెండు మూడు రోజుల్లో సమస్య కొలిక్కి వస్తుందని, రేపటి లోగా కన్వేయర్ బెల్ట్ రిపైర్ చేసి లోపల కూలిన మట్టిని బయటికి తీస్తారని తెలియ జేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను వాడతామని, ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సొరంగ నిర్మాణంలో కూడా రోబోలను వాడమని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు.