గతంలో కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్.. విలీనానికి అంతా ప్లాన్ రెడీ: కేంద్ర మంత్రి బండి

by Mahesh |
గతంలో కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్.. విలీనానికి అంతా ప్లాన్ రెడీ: కేంద్ర మంత్రి బండి
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనానికి ప్లాన్ రెడీ అయిందని, కేవలం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని వార్తలు కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తుందని బండి ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో ఏమీ లేని బీఆర్ఎస్ ను తాము ఎందుకు బీజేపీలో విలీనం చేసుకుంటామని.. మీడియా సాక్షిగా ప్రశ్నించారు. తాము కుటుంబ పార్టీలను దగ్గరకు కూడా రానివ్వమని కరాకండిగా చెప్పారు. అలాగే గతంలో సీఎల్సీని టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారని.. ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుంటున్నారని, ఈ విలీనానికి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed