- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Secretariat: కేంద్ర మంత్రి చౌహాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి(Secretariat) కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chauhan), బండి సంజయ్(Bandi Sanjay) వచ్చారు. పంటనష్టంపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంట నష్టాన్ని కేంద్రమంత్రికి అధికారులు వివరించారు.
అంతకుముందు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఖమ్మం(Khammam) జిల్లా పాలేరులో పంట నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతులకు తప్పకుండా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎస్డీఆర్ఎఫ్, కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు. ఏపీ, తెలంగాణలోని వరద నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తామని తెలిపారు.