Maharashtra Elections : మహారాష్ట్ర పీసీసీ ఆఫీస్‌లో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్

by Ramesh N |   ( Updated:2024-11-09 07:53:47.0  )
Maharashtra Elections : మహారాష్ట్ర పీసీసీ ఆఫీస్‌లో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Maharashtra Elections) మహారాష్ట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీనికోసం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో ఇవాళ ఉదయం బయలుదేరి ముంబయి చేరకున్నారు. ముంబయిలో మహారాష్ట్ర పీసీసీ కార్యాలయంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుక్కు, ఏఐసీసీ జాతీయ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలతో సీఎం రేవంత్ తాజాగా సమావేశం అయ్యారు.

మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో నవంబర్ 20న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ సీఎంల సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఎన్నికల మేనిఫెస్టో, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమావేశాల అనంతరం పలు నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. కాగా, ఇటీవల హర్యానా, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విఫలమైన విషయం తెలిసిందే. ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యేలా కాంగ్రెస్ కూటమి ప్లాన్ చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story