Revanth Reddy: అవసరమైతే ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు.. సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ వేళ రేవంత్ రెడ్డి హట్ కామెంట్స్

by Prasad Jukanti |
Revanth Reddy: అవసరమైతే  ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు.. సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ వేళ రేవంత్ రెడ్డి హట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల విషయంలో జరిగిన గందరగోళంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో నేను ఎవరి పేర్లు ప్రస్తావించలేదని చెప్పారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి.. మల్కాజిగిరిలో నా గెలుపుకు బాధ్యత తీసుకుంటానని చెప్పి, నా టికెట్ ప్రకటించగానే సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లారని ధ్వజమెత్తారు. అండగా ఉంటానని నన్ను కాంగ్రెస్ లో చేర్చి ఆమె బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయిందని తమ్ముడిని ఒంటరిని చేసి అక్క అన్యాయం చేసిందని విమర్శించారు. సభలో ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడవద్దని ఇవాళ సబితక్క మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడాన్నారు. అయినా సభలో నేను పొలిటికల్ అనుభవాలు మాత్రమే చెప్పానన్నారు.

కేసీఆర్ కు ఆ పదవి ఎందుకు?:

మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత అని భట్టి క్లియర్ గా చెప్పారని అంతకంటే ఏం మాట్లాడగలం అన్నారు. 2014లో సబితకి అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. 2018లో ఉత్తమ్ టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. సునీత లక్ష్మారెడ్డి కోసం ప్రచారానికి వెళ్తే కౌడిపల్లి, నర్సాపూర్ లో నాపై రెండు కేసులు అయ్యాయి. నా కేసుల్లో నేను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. సునీత లక్ష్మారెడ్డి మాత్రం బీఆర్ఎస్ లో చేరి మహిళా కమిషన్ చైర్ పర్సన్ అయ్యారన్నారు. అక్కలకి అన్యాయం జరిగితే కేసీఆర్, హరీష్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సబితక్క ఆవేదన చూసి అయినా కేసీఆర్, హరీష్ సభకి రావాలి కదా అన్నారు. కేసీఆర్ కు బాధ్యత లేదని అధికారం ఉంటేనే సభకు వస్తాను లేకపోతే రాను అని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. కేటీఆర్, హరీష్ సరిపోతే కేసీఆర్ ఫ్లోర్ లీడర్ గా ఎందుకు? అని ప్రశ్నించారు.

సభ్యత్వాలు రద్దు కావొచ్చు:

ఈ సభ చాలా డెమోక్రటిక్ గా ఉందని, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. చర్చకి ఇవ్వాల్సినంత సమయం ఇచ్చామన్నారు. సభలో హరీశ్ రావు 2 గంటల 11 నిమిషాల పాటు, కేటీఆర్ 2 గంటల 35 నిమిషాల పాటు, జగదీశ్ రెడ్డి 1 గంట 10 నిమిషాల పాటు మాట్లాడారని చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్షానికి ఇంత సమయం కేటాయించారా? అని ప్రశ్నించారు. సభలో సస్పెన్స్ ఉండొద్దు అనేది మా ఆలోచన అని అయితే అవసరాన్ని బట్టి ఎమ్మెల్యేల సభ్యత్వం కూడా రద్దు కావొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో శాసనసభ సభ్యత్వాలు కూడా రద్దు కావచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా సంపత్, వెంకట్ రెడ్డిల సభ్యత్వం రద్దు కాలేదా? గతంలో నన్ను సభకే రానివ్వలేదన్నారు. నా దగ్గరికి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి టీ తాగి చాలాసేపు మాట్లాడి వెళ్లారు. వచ్చినంత మాత్రానా పార్టీ మారినట్టు కాదు కదా అన్నారు. కలవడం, మాట్లాడడం జరగగానే రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్టు కాదని అంత మాత్రాన మా మధ్యలో కోర్డినేషన్ లేదనడం అమాయకత్వం అన్నారు.

Advertisement

Next Story