- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీని ‘బడే భాయ్’ అనడానికి కారణం అదే.. అసెంబ్లీలో అసలు విషయం బయటపెట్టిన రేవంత్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని బడే భాయ్ అంటూ సీఎం రేవంత్ సంబోధించడం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపిన విషయం తెలసిందే. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని.. ఈ చీకటి ఒప్పందంలో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని బడే భాయ్ అన్నాడని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ప్రధాని మోడీని బడే భాయ్ అనడానికి గల అసలు కారణాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకు రివీల్ చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో స్టేట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రధాని మోడీని బడే భాయ్ అన్నామని.. అంతకు మించి అందులో ఏమి లేదని క్లారిటీ ఇచ్చారు.
అన్ని రాష్ట్రాల్ని సమానంగా చూడాలని బహిరంగా సభపైనే ప్రధాని మోడీని కోరానని గుర్తు చేశారు. ప్రధాని హోదాలో అన్ని రాష్ట్రాలతో పెద్దన్నలాగా వ్యవహరించాలని మోడీని కోరామన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి తెలంగాణకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన మోడీ రాష్ట్రం పట్ల వివక్ష చూపించారని ఫైర్ అయ్యారు. నిధులన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు, మిత్ర పక్ష రాష్ట్రాలు అయిన ఉత్తరప్రదేశ్, బీహార్, యూపీ, గుజరాత్‌కే కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని 8 సీట్లలో గెలిపించిన నిధుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు.