- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mumbai : సీఎం రేవంత్ రెడ్డి మీకు పచ్చి అబద్ధాలు చెప్పారు.. ముంబైలో కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎన్నికల (Maharashtra Elections) ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్ధాలను ఇక్కడి ప్రజలకు చెప్పారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎలా మోసం చేస్తోందో మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను.. అని వెల్లడించారు. ఇచ్చిన హామీల్లో 99% ఇంకా మొదలే కాలేదన్నారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జోడీ.. తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో.. అదే తరహాలో మహారాష్ట్ర ప్రజలను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. తెలంగాణ సర్కార్ ఏటీఎం ద్వారా.. డబ్బులు తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చుపెడుతున్నారని అన్నారు. రాహుల్, సోనియా, ప్రియాంక, రేవంత్ రెడ్డి.. ఊరూరా తిరిగి ఆరు గ్యారంటీల పేరుతో ఢంకాబజాయించారని తెలిపారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ రేవంత్ చెప్పారని. రైతులెవ్వరూ అప్పులు కట్టొద్దని వారిని రెచ్చగొట్టారని అన్నారు. మేనిఫెస్టోలో మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చి నెలకు రూ.2,500 రూపాయలు.. ఇప్పటివరకు ఏ ఒక్క మహిళకు కూడా ఈ పథకం లబ్ధి అందలేదని తెలిపారు. రైతులకు రైతు భరోసా, వివిధ పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో.. ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేదన్నారు. కానీ.. హైదరాబాద్లో మాత్రం.. మూసీ పేరుతో.. దశాబ్దాలుగా ఉన్నవారిని ఇండ్లనుంచి బయటకు గెంటేసి.. ఆ ఇళ్లు కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మేనిఫెస్టోలో మొదటి పేజీలోని పథకాలే అమలుచేయలేని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు.. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు రావడం విడ్డూరం, హాస్యాస్పదమన్నారు. పేపర్లలో భారీగా ప్రకటనలు ఇవ్వడమే తప్ప వాటిని అమలుచేసే శక్తి కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. గ్రూప్ పరీక్షల నోటిఫికేషన్ కూడా ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా.. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసేందుకు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని భావిస్తే.. రాహుల్ గాంధీకి సవాల్ చేస్తున్నా.. ముంబై ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదని, దాదాపు రూ.8లక్షల అప్పులున్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ లూటీ.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లూటీ చేస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని కోరారు.