- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను ఎక్కడున్నా నా కన్ను మీ మీదే ఉంటుంది.. CM రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తాను ఎక్కడున్నా.. తన మనసు, కన్ను ఎప్పుడూ కొడంగల్ ప్రజలవైపే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొడంగల్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా అని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని మాటిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను కనీసం ప్రచారానికి రాకున్నా మంచి మెజార్టీతో గెలిపించారని గుర్తుచేసుకున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నారని భావోద్వేగానికి లోనయ్యారు.
కేవలం కార్యకర్తలను కలవాలనే ఇవాళ కొడంగల్‌కు వచ్చానని తెలిపారు. ఎన్నికలు వస్తే ఎవరైనా తీర్థ యాత్రలకు వెళ్దాం అనుకుంటారు.. కానీ నాకు కొడంగల్‌కు వస్తేనే మనశ్శాంతిగా ఉంటుందని అన్నారు. ఓటు హక్కు చాలా విలువైందని.. అందరూ జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. త్వరలో కొడంగల్‌కు సిమెంట్ ఫ్యాక్టరీ రాబోతోందని చెప్పారు. ఎక్కడైనా పరిశ్రమలు వస్తేనే.. అక్కడి భూములకు విలువ పెరుగుతుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కొడంగల్లో కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు.