- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Revanth: లీజును రెన్యువల్ చేసి సహకరిస్తాం
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని గబ్చిబౌలిలో నిర్వహించిన బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మకుమారీస్ బాటలోనే ప్రభుత్వం ముందుకువెళ్తోందని అన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తమది రైతు ప్రభుత్వమని చెప్పారు. రైతుల మీద అపారమైన ప్రేమ ఉండబట్టే అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేశామని అన్నారు. తమ ప్రభుత్వం శాంతిసరోవర్‌కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. లీజును రెన్యువల్ చేసి సహకరిస్తామని హామీ ఇచ్చారు. బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో శాంతి సరోవర్ ఉండటం.. అది కూడా హైదరాబాద్‌లో ఉండటం ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో రైతులను రుణవిముక్తులను చేయడంతో పాటు డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడుతామని అన్నారు. అంతేకాదు.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.