- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దేశంలో ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా.. మోడీకి ఆ దేశం గుర్తుస్తోంది: సీఎం రేవంత్ సెటైర్
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఢిల్లీలో సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రధాని మోడీకి పాకిస్థాన్ గుర్తుకు వస్తుందని సెటైర్ వేశారు. కాంగ్రెస్‌కు పాకిస్థాన్‌పై ఉందని మోడీ అంటున్నారు.. మరీ ఆ దేశ దేశ ప్రధాని పుట్టిన రోజు వేడుకలకు వెళ్లింది ఎవరని ప్రశ్నించారు. మోడీ ఇష్టం మేరకే పాక్ వెళ్లి ఆ దేశ ప్రధానిని కౌగిలించుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ తన పదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేశారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల దేశ పురోగతిపై ప్రోగ్రెస్ కార్డును విడుదల చేయాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సారి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. నియంతృత్వ పాలన చేస్తోన్న బీజేపీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు.