కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి బూతు పురాణం.. ‘సవటా, దద్దమ్మ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు

by Anjali |   ( Updated:2024-05-05 12:54:55.0  )
కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి బూతు పురాణం.. ‘సవటా, దద్దమ్మ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ గురించి, రైతుబంధు గురించి కేసీఆర్ మాట్లాడుతుండటంపై రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో మందు వేసి మాట్లాడుతుందో నాకు తెలియడం లేదని విరుచుకుపడ్డారు. మందు దిగినాక మాట్లాడుతుండో.. వేసే ముందు మాట్లాడుతుండో అని విమర్శలు గుప్పించారు. రైతుబంధు పథకమే ఇస్తలేరని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఓ సన్నాసోడా, సోయిలేనోడా, సవటా, దద్దమ్మ, దిక్కుమాలినోడా’ అంటూ రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం రైతుబంధు సాయంపై కీలక ప్రకటన చేశారు. మొత్తం 69 మంది లక్షల మంది లబ్ధిదారుల్లో 65 లక్షల మందికి రైతు బంధు డబ్బులు అందినట్లు వెల్లడించారు. ఇంకా మిగిలింది 4 లక్షల మందే అని చెప్పారు. వీరి ఖాతాల్లో మే 8వ తేదీ లోగా డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఆగస్టు 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని తేల్చిచెప్పారు. రైతుబంధు డబ్బులు రావడం లేదని ప్రశ్నించిన మాజీ సీఎం కేసీఆర్‌ను మే 9న అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు..

Read More..

ఏ సంకీర్ణంలో చేరుతావు.. KCRకు CM రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న

Advertisement

Next Story