- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒకేసారి 30 వేల మంది టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి
దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వంలో పదోన్నతులకు నోచుకోకుండా ఇబ్బంది పడిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇటీవల ఆ ప్రక్రియను పూర్తి చేసింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కసరత్తుతో రాష్ట్రంలోని సుమారు 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు లభించాయి. వారి నుంచి ప్రశంసలు వస్తుండడంతో ఆ సంతోషాన్ని పంచుకోడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు వేదికగా సిటీలోని ఎల్బీ స్టేడియం ను ఎంచుకున్నారు. అన్ని జిల్లాల్లో పదోన్నతులు పొందిన సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులతో ఆ కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఆగస్టు 2వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించేలా చీఫ్ సెక్రటరీ శాంతికుమారి డేట్ ఫిక్స్ చేశారు. దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా డీజీపీ జితేందర్ సహా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో వివరించారు.
అన్ని జిల్లాల నుంచి ఉపాధ్యాయులను ఆగస్టు 2న మధ్యాహ్నం 3 గంటలకు ఎల్బీ స్టేడియంకు రప్పించేలా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా అధికారులతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయన్నారు. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడేందుకు ఆగస్టు రెండో తేదీన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఉపాధ్యాయులు వస్తున్నందున వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రెయిన్ ప్రూఫ్ టెంటు సౌకర్యాలు చేయాలని, తగిన పార్కింగ్ సౌకర్యాన్ని కూడా రెడీ చేయాలన్నారు.
చీఫ్ సెక్రటరీ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో డీజీపీ జితేందర్, ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.