- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరీష్ రావుపై CM రేవంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు లక్షలకు పైబడిన రుణాలపై తాజాగా సీఎం క్లారిటీ ఇచ్చారు. బుధవారం మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాస్త ఆలస్యమైన తప్పకుండా అందరికీ రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్లలో గ్రీవెన్స్ పెట్టామని వెల్లడించారు. రుణమాఫీ కానివారి లిస్ట్ కలెక్టరేట్‌లో ఇవ్వాలని అన్నారు. ఇప్పటివరకు 17, 933 కోట్లు జమ చేశామని చెప్పారు. రుణమాఫీ విషయంలో హరీష్ రావు సవాల్ చేసి పారిపోయారు అని ఎద్దేవా చేశారు. రాజీనామా చేస్తానని చేయకుండా పారిపోయారని అన్నారు. హరీష్ రావుకు మాట్లాడే నైతికత లేదని సెటైర్లు వేశారు. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి రైతు దగ్గరకు వెళ్లండని అన్నారు. రుణమాఫీ కాని వారి వివరాలు సేకరించండని, వివరాలు సేకరించి కలెక్టరేట్‌లో ఇవ్వండని ఘాటు వ్యాఖ్యలు చేశారు.