- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ వరదల ఎఫెక్ట్.. CM రేవంత్ మరో కీలక నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదలు జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాలు నీట మునిగిపోయాయి. పలు కాలనీలు ఇంకా నీటిలో చిక్కుకుని ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు, ఏపీలోని విజయవాడ ప్రాంతాల్లో వరద తీవ్రత చాలా ఎక్కువగా కనిపించింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్ల పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గృహకల్ప వాసులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు.
నష్టపోయిన ప్రతి కుటుంబానికి నిత్యావసరాలతో పాటు.. రూ.10 వేలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అంతేకాదు.. ఇంటింటి సర్వే చేసి నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. అందరూ ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మొత్తంగా రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో అత్యధికంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా కాకరవాయిలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తంది. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.