KTR : నీలి మేఘాల్లో సీఎం రేవంత్ .. నీలి నీడల్లో గురుకులాల భవిష్యత్తు : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : నీలి మేఘాల్లో సీఎం రేవంత్ .. నీలి నీడల్లో గురుకులాల భవిష్యత్తు : కేటీఆర్
X

దిశా, వెడ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Rreddy) ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల నిర్వహణ అధ్వాన్నంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)విమర్శించారు. నీలి మేఘాల్లో సీఎం రేవంత్ .. నీలి నీడల్లో గురుకులాల భవిష్యత్తు అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. పట్టెడు అన్నం కోసం విద్యార్థుల పోరాటం..మూసీ ముడుపుల కోసం రేవంత్ ఆరాటమని, కంచం లో పురుగులు..కాటేసే పాములు..కారణం లేని మరణాలతో విద్యార్థుల పోరాటం..అదానితో దోస్తీ, అల్లుడి ఆస్తుల కోసం రేవంత్ ఆరాటమని కవితాత్మక ధోరణలో విమర్శలు సంధించారు. కనీస వసతులు లేక, సరిపడా మరుగుదొడ్లు లేక,అనారోగ్యాలతో విద్యార్థుల పోరాటం..లగచర్ల పై లాఠీ విరిచి , రైతుల నడ్డి విరిచి ఫార్మా పేరుతో భూదందాకై రేవంత్ ఆరాటమని దుయ్యబట్టారు.

పురుగుల అన్నం తిని అంబులెన్స్ లో విద్యార్థులు..పంచభక్ష పరమాన్నాలు తిని హెలికాఫ్టర్ లో రేవంత్, మంత్రుల షికార్లు అని చురకలేశారు. మూసీలో లక్షల కోట్లు కుమ్మరిస్తున్న ముఖ్యమంత్రి..విద్యార్థి కడుపుకు నాణ్యమైన బుక్కెడు బువ్వ కోసం ఖర్చుపెట్టవా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed