AP Assembly: అసెంబ్లీ కమిటీలకు సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తి.. స్పీకర్ అయ్యన్న కీలక ప్రకటన

by Shiva |
AP Assembly: అసెంబ్లీ కమిటీలకు సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తి.. స్పీకర్ అయ్యన్న కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ కమిటీలకు సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఇవాళ ముగిసింది. ఈ మేరకు కమిటీలకు ఎన్నికైన సభ్యలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Pathrudu) అసెంబ్లీ (Assembly)లో ప్రకటించారు. పీఏసీ (PAC) కమిటీకి నక్కా ఆనంద్ బాబు, అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, రామాంజనేయులు, జయనాగేశ్వర్ రావు, కోళ్ల లలితకుమారి, శ్రీరాం రాజగోపాల్, పులపర్తి ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. అదేవిధంగా అంచనాల కమిటీ సభ్యులుగా భూమ అఖిల ప్రియ, బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరావు, కందుల నారాయణ రెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, కొలుసు పార్థసారథి, సునీల్ కుమార, ఏలూరి సాంబశివరావు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఇక ప్రభుత్వ రంగ సంస్థల సమితి సభ్యులుగా బత్తుల ఆనంద్ బాబు, ఈశ్వర్ రావు, సత్యానారాయణ, గౌత్ శీరిష, కూన రవికుమార్, వర్ల కుమార్ రాజు, సజయకృష్ణ రంగారావు, తెనాలి శ్రవణ్ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్‌లు సభ్యులుగా ఎన్నికైనట్లుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Speaker Ayyanna Pathrudu) ప్రకటించారు.AP Assembly: అసెంబ్లీ కమిటీలకు సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తి.. అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న కీలక ప్రకటన



Next Story

Most Viewed