Wakes Up : చనిపోయి బతికొచ్చాడు! చితిపై కళ్లు తెరిచిన వ్యక్తి.. ముగ్గురు వైద్యులు సస్పెండ్

by Ramesh N |
Wakes Up : చనిపోయి బతికొచ్చాడు! చితిపై కళ్లు తెరిచిన వ్యక్తి.. ముగ్గురు వైద్యులు సస్పెండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Rajasthan) రాజస్థాన్‌లోని జున్‌జున్ జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుది. చనిపోయాడని ప్రకటించిన డాక్టర్లు.. వ్యక్తి దహన సంస్కారాలకు ముందే కళ్లు తెరిచి అందరికి షాక్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. 25 ఏళ్ల చెవిటి, మూగ వ్యక్తి కుమార్ ఆరోగ్యం క్షీణించడంతో గురువారం జున్‌జున్‌లోని బీడీకే హాస్పిటల్‌కి తీసుకెళ్లనట్లు పోలీసు నివేదకలు సూచిస్తున్నాయి. కుమార్ చికిత్సకు స్పందించకపోవడంతో ఆసుపత్రి వైద్యులు మధ్యాహ్నం 2 గంటలకు అతను చనిపోయినట్లు ప్రకటించారు. అందుకు అవసరమైన డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసి బాడిని శ్మశానవాటికకు తరలించారు.

మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కుమార్ ఒక్కసారి కళ్ళు తెరిచి ఊపిరి తీసుకుంటున్నాడు. ఇది చూసిన వ్యక్తులు వెంటనే అంబులెన్స్‌లో తిరిగి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ రమావతార్ మీనా విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ విచారణలో వైద్యుల నిర్లక్ష్యం గుర్తించారు. గురువారం రాత్రి డాక్టర్ యోగేష్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, పీఎంవో డాక్టర్ సందీప్‌లను (Doctors Suspended) సస్పెండ్ చేశారు. ఇక, కుమార్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు ధ్రువీకరించారు.

Advertisement

Next Story