నేడు నాందేడ్‌కు సీఎం కేసీఆర్.. వెయ్యి మందితో కీలక సమావేశం!

by GSrikanth |   ( Updated:2023-05-18 23:31:02.0  )
నేడు నాందేడ్‌కు సీఎం కేసీఆర్.. వెయ్యి మందితో కీలక సమావేశం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్రలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 19, 20 తేదీల్లో పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు ప్రారంభించేందుకు కేసీఆర్ శుక్రవారం ముంబై వెళ్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అందులో భాగంగానే పార్టీ మొదటి కార్యాలయాన్ని సైతం ప్రారంభించనున్నారు. రెండ్రోజులపాటు పార్టీ నిర్వహించే శిక్షణ తరగతులకు నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున ప్రతినిధులను ఎంపిక చేసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 864 మంది హాజరుకానుండగా, మరో వందమంది ముఖ్య నేతలు మొత్తం సుమారు వెయ్యిమంది హాజరుకానున్నట్లు సమాచారం.

ఈ నెల 22 నుంచి...

మహారాష్ట్రలో ఈనెల 22 నుంచి పార్టీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేయనున్నారు. సాధారణ సభ్యత్వం, క్రియాశీలక సభ్యత్వం చేయించాలని పార్టీ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ సభ్యత్వాన్ని అధికంగా చేయాలని, అందుకు టార్గెట్ సైతం విధించారు. జూన్ 22 వరకు నెల రోజుల పాటు సభ్యత్వ నమోదును ముమ్మరం చేయనున్నారు. అదే విధంగా గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలను సైతం వేయనున్నారు. ఎక్కువగా మహిళలకు, రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి కమిటీల్లో ఉండేలా చూసుకోవాలని నేతలకు సూచించారు. మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల చివరి వారంలో ఔరంగాబాద్‌లో పార్టీ కార్యాలయానికి కేసీఆర్ భూమిపూజ చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed