- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారు: కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు పాలమూరు బిడ్డ అంటే హైదరాబాద్, ముంబైలో అడ్డా కూలీ అని.. కానీ ఇప్పుడు ఇతర ప్రాంతాల నుండి తెలంగాణకు వచ్చి పనులు చేసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సం మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల చరిత్రలో ఇవాళ సువర్ణక్షర లిఖితమని అన్నారు.
పాలమూరు ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించానని కేసీఆర్ ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో నా తొలిపాదయాత్ర జోగులాంబ గద్వాల నుంచే చేశానని చెప్పారు. కొందరు నేతల వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇన్నాళ్లు ఆలస్యమైందని మండిపడ్డారు. ఇంటి దొంగలే మనకు ప్రాణగండం తెచ్చారని గత పాలకులపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులకు ఆశపడి సమైక్య రాష్ట్ర సీఎంలను ఎవరూ ప్రశ్నించలేదన్నారు.