పవర్ ఐలాండ్‌‌గా హైదరాబాద్‌: CM KCR

by GSrikanth |   ( Updated:2022-12-09 07:04:28.0  )
పవర్ ఐలాండ్‌‌గా హైదరాబాద్‌: CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్: రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం మెట్రో విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. అనంతరం అప్పా జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో హైదరాబాద్‌ నగరానికి ప్రత్యేక స్థానముందన్నారు. సమైక్య పాలనలో హైదరాబాద్‌ నగరం నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. ఇప్పుడు అన్ని సమస్యలను అధిగమించి అభివృద్ధి చేసుకుంటున్నామని వెల్లడించారు. ప్రస్తుతం దినదినాభివృద్ధి చెందుతూ విశ్వనగరంగా దూసుకెళ్తోందన్నారు. మెట్రో.. ఎయిర్‌పోర్టు కలెక్టివిటీతో ముందుకు వెళ్తున్నామన్నారు. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా మార్చామన్నారు. న్యూయార్క్, లండన్, పారిస్‌లో అయినా కరెంట్ పోతుందేమో కానీ, ప్రస్తుతం హైదరాబాద్‌లో కరెంట్ పోయే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. మెట్రో ఏర్పాటులో ట్రాఫిక్ కష్టాలు సైతం తీరనున్నాయని అన్నారు.

ప్రపంచంలో కాలుష్య రహిత మార్గం మెట్రో మార్గమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌ నలుమూలలా మెట్రో సేవలను విస్తరిస్తామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సాయమున్నా.. లేకున్నా వెనకడుగువేయబోమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచమే అబ్బురపడే విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి ఎన్నో అవార్డులు సైతం వరించాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సోమేశ్ కుమార్‌, మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌ముద్ అలీ, సబిత, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, ఎంపీలు కేశ‌వ‌రావు, రంజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.

Also Read....

BJP మాస్టర్ ప్లాన్.. మరోసారి తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు!

Advertisement

Next Story