పాట ఒకరిది.. పేరు సీఎం సాబ్‌ది..!

by Nagaya |
పాట ఒకరిది.. పేరు సీఎం సాబ్‌ది..!
X

దిశ,గుండాల: నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యపై గుండెల నిండా బాధతో పాట రాసిన అని నిన్న జరిగిన టీఆర్ఎస్ మునుగోడు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ నిజానికి అది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని గంగపురం గ్రామానికి చెందిన అభ్యుదయ వాదీ, కవి గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు కోదారి శ్రీను.. ప్రముఖ కవి అందెశ్రీ సంపాదకత్వంలో రూపొందిన నిప్పుల వాగు అనే పుస్తకంలో రాయడం జరిగింది. కోదారి శ్రీను తన చిన్నతనం నాటి నుండి తెలంగాణ ప్రజల బాధలను, అలవాట్లను సంస్కృతిని పాటల రూపంలో ప్రజలకు చేరవేస్తూ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ జాగృతి రాష్ట్ర సాంస్కృతిక సారథిగా పనిచేస్తున్నారు. నిన్న మునుగొడులో జరిగిన టీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చూడు చూడు నల్లగొండ..... గుండె నిండా ఫ్లోరైడ్ బండ..... అనే పాటను తానే రాసినట్లు తెలపడంతో కోదారి శ్రీను అభిమానులు, మండల ప్రజలు సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చెప్పిన అబద్ధపు మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రే ఇలా కవులను అవమానపరిచే విధంగా అబద్ధపు మాటలు చెప్పడం ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story