కొల్లూరులో డబుల్ ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-22 07:38:06.0  )
కొల్లూరులో డబుల్ ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ ఇళ్ల నిర్మాణ సముదాయాన్ని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం భారీ భద్రత నడుమ డబుల్ ఇళ్ల టౌన్ షిప్‌ను సీఎం కేసీఆర్ సందర్శించారు. 145 ఎకరాల్లో 15,600 డబుల్ ఇళ్లను ప్రభుత్వం కొల్లూరులో నిర్మించింది. జీహెచ్ ఎంసీ పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయనున్నారు. 117 బ్లాక్ లలో 1,489 కోట్ల అంచనా వ్యయంతో గెటేడ్ కమ్యూనిటీ తరహా అతిపెద్ద డబుల్ ఇళ్ల టౌన్ షిప్‌ను సర్కారు అత్యం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

జీ ప్లస్ 10 అంతస్తులు ప్రతి అపార్ట్ మెంట్‌లో ఉన్నాయి. ఈ డబుల్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఆధునిక హంగులు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అవసరమైన నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా కోసం 33/11 కేవీ సబ్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సముదాయంలో 118 దుకాణాలను ప్రభుత్వం నిర్మించింది. సీఎం కేసీఆర్ వెంట పురపాలక మంత్రి కేటీఆర్, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.

Read More... Ponguleti Srinivasa Reddy : భట్టి పాదయాత్ర శిబిరానికి పొంగులేటి.. సీఎం కేసీఆర్‌పై ఫైర్

Advertisement

Next Story

Most Viewed