- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో పంటనష్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అకాల వర్షం కారణంగా 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని స్పష్టం చేశారు. ఎక్కువమంది రైతులు వందశాతం పంటను నష్టపోయారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84 లక్షల ఎకరాల్లో వరిసాగు ఉందని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా పరిహారం ఇస్తామని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల గోస పట్టదని, తమ రైతులను తామే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. అనంతరం కాసేపటికే అధికారులు నిధులు విడుదల చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి : ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి.. అడిషనల్ కలెక్టర్