- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM KCR: మంత్రి హరీష్‌తో కలిసి ఇంటికి రా.. సర్పంచ్ నీలం మధుకు సీఎం ఆహ్వానం!
దిశ బ్యూరో, సంగారెడ్డి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా అభినందించారు. మంచి యాక్టీవ్‌గా పనిచేస్తున్నావంటూ బుజం తట్టి మెచ్చుకున్నారు. గురువారం రామచంద్రాపురం మండలం కొల్లూరులో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నీలం మధు సీఎంను కలిశాడు. పుష్పగుచ్చం అందించి ఆశీస్సులు తీసుకున్నాడు.
‘మధూ బాగా యాక్టీవ్‌గా పనిచేస్తున్నావ్. మంత్రి హరీష్ రావుతో కలిసి ఇంటికి రా’ అని మధును సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. సీఎం ఆత్మీయ పిలుపుతో నీలం మధు మురిసిపోయాడు. ఆ తరువాత మధు అక్కడే ఉన్న మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్లగానే టెన్షన్ వద్దు అని బుజం తట్టారు. హరీష్(మంత్రి) సార్ ఉన్నాడు.. టెన్షన్ అక్కర లేదని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రత్యేకంగా అభినందించడంతో నీలం మధు సంబరపడిపోయారు. సీఎం ఆశీస్సులు వెయ్యి ఎనుగుల బలాన్ని ఇచ్చాయని మధు సంతోషం వ్యక్తం చేశారు. మధును సీఎం ఇంటికి పిలవడంతో ఆయన సన్నిహితులు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
ముగిసిన దశాబ్ది ఉత్సవాలు.. నెక్ట్స్ ఆ ప్రోగ్రామ్స్‌పై సీఎం కేసీఆర్ ఫోకస్!