జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-27 07:30:23.0  )
జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సినీ నటి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపీ శ్రీమతి జమున మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆమె మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్ఞాపకాలను సీఎం స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాలలోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని జమున పొందారన్నారు. నటిగా కళా సేవనే కాకుండా పార్లమెంట్ సభ్యురాలిగా ప్రజా సేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read...

లోకేష్ పాదయాత్రలో అపశృతి.. స్పృహతప్పి పడిపోయిన తారకరత్న

టాలీవుడ్‌లో మరో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత

Advertisement

Next Story