- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాష్ట్ర అధ్యక్షుడిగా ‘బండి’ని కొనసాగిస్తారా.. అధికారిక ప్రకటన వచ్చేది ఇవాళే!
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌నే కొనసాగించడంపై నేడు క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇవ్వాళ రాత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్న అనంతరం ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. అయితే భేటీ ఏ అంశంపై అన్నది తెలియాల్సి ఉంది. కాగా బండి పొడిగింపుపై మాత్రం నేటితో స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అధ్యక్షుడిగా బండి నేటితో మూడేండ్లు పూర్తిచేసుకోనున్నారు. 11 మార్చి 2020లో బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా బండిని నియమించింది. బీజేపీలో పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడేండ్లకు ఒక టర్మ్ గా అధ్యక్షుడు కొనసాగుతారు. కాగా ఒక్కొక్కరికి రెండు పర్యాయాలు ఉండేందుకు అవకాశముంది. శనివారంతో బండి సంజయ్ తన మొదటి టర్మ్ అంటే మూడేండ్లను పూర్తిచేసుకోనున్నారు.
కాగా, ఇది ఎన్నికల ఏడాది కావడంతో బండినే కొనసాగించాలని పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఎందుకంటే ఎక్కడో ఉన్న పార్టీని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఎదిగేలా చేయడంలో బండి విజయవంతమయ్యారు. అందుకే జాతీయ నాయకత్వం ఇప్పటికే పలుమార్లు బండిని ప్రశంసించింది. ఏకంగా ప్రధాని మోడీ శభాశ్ అని బండి సంజయ్ ని పలుమార్లు అభినందించారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధాని మోడీ ప్రశంసించే స్థాయికి చేరుకోవడం అంత ఆషామాషీ కాదు. అందుకే 2024 ఎన్నికల వరకు బండి సారథ్యంలోనే ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసుకోవాలని పార్టీ భావిస్తోంది. కాగా అమిత్ షా భేటీ అనంతరం బండిని పొడగించడంపై పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశముంది.