బీఆర్ఎస్‌కు గ్రీన్ సిగ్నల్ అప్పుడే.. పార్టీ నేతలకు ప్రగతి భవన్ నుంచి సమాచారం!

by Vinod kumar |   ( Updated:2022-11-30 02:17:26.0  )
బీఆర్ఎస్‌కు గ్రీన్ సిగ్నల్ అప్పుడే.. పార్టీ నేతలకు ప్రగతి భవన్ నుంచి సమాచారం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిసెంబర్ 10న బీఆర్ఎస్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయం పార్టీ నేతలకు ప్రగతి భవన్ నుంచి సమాచారం అందింది. టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్‌గా మారుతుందనే విషయాన్ని ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని ఇప్పటికే నేతలకు అధినేత కేసీఆర్ ఆదేశించారు. అయితే పార్టీ కార్యక్రమాల్లో ఇదే విషయాన్ని నేతలు ప్రస్తావిస్తున్నారు. దసరా రోజున తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మాన కాఫీని కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు. అయితే బీఆర్ఎస్ పేరుపై ఏమైనా పేర్లు ఉంటే అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉండటంతో ఈ నెల 7న కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు పత్రికా ప్రకటన ఇచ్చారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తున్నామని, కొత్త పేరుపట్ల ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాటికి గల కారణాలతో తమ అభ్యంతరాలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ సెక్రటరీకి 30 రోజుల్లోగా పంపాలని కోరారు. అయితే గడువు డిసెంబర్ 6 తో ముగుస్తున్నప్పటికీ గుజరాత్ ఎన్నికలు ఉండటం, 8న తుది ఫలితాలు సైతం వెలువడనుండనుంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో డిసెంబర్ 10న క్లారిటీ వస్తుందని ప్రగతి భవన్ వర్గాలు నేతలకు సమాచారం అందించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్‌గా మారుతుందని, పార్టీ గుర్తు కారు ఉంటుందని మార్పులు ఏమీ ఉండవని ప్రజలకు వివరించాలని పార్టీ ఎమ్మెల్యే లు, ఎంపీ, ఎమ్మెల్సీల తో పాటు పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ సూచించారు. ఇదే విషయాన్ని సమావేశాల్లోనూ ప్రస్తావిస్తున్నారు. ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉన్న అనుమానాలను సైతం నివృత్తి చేస్తున్నారు. అయితే కేసీఆర్ డిసెంబర్ 9న బీఆర్ఎస్ కు గ్రీన్ సిగ్నల్ వస్తుందని భావించి బీఆర్ఎస్ పేరుతో ఢిల్లీలో మొదటి సభ నిర్వహిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆ తేదీలోగా క్లారిటీ రాకపోతుండటంతో దానిని వాయిదా వేశారు. వచ్చే నెల 10న బీఆర్ఎస్‌పై క్లారిటీ వస్తున్న నేపథ్యంలో తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే దానిపై త్వరలోనే పార్టీ అధినేత స్పష్టత నిచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.



Read More......

ఆల్వేస్ ఐయామ్ రెడీ: మంత్రి గంగుల కమలాకర్

Advertisement

Next Story

Most Viewed