‘చీకోటి ప్రవీణ్‌ను దేశ బహిష్కరణ చేయాలి’

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-02 11:12:47.0  )
‘చీకోటి ప్రవీణ్‌ను దేశ బహిష్కరణ చేయాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల క్యాసీనో వ్యవహారంలో థాయిలాండ్‌లో అరెస్ట్ అయిన చీకోటి ప్రవీణ్‌ను దేశ బహిష్కరణ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇలాంటి చీటర్ వల్ల దేశానికి అగౌరవ పాలు చేస్తారని విమర్శించారు. చీకోటి ప్రవీణ్ చీకటి సామ్రాజ్యం వల్ల ఆంధ్ర, తెలంగాణను గబ్బు పట్టించారని విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అతను బీజేపీ అనుకూలంగా ఉంటారని తెలిపారు. ఒక చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇక్కడ నుంచి కొంత మందిని తీసుకపోయి థాయిలాండ్‌లో క్యాసీనో ఆడుతు పోలీసులకు దొరికాడన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎవరేవరు థాయిలాండ్ పోయారో.. ఇదివరకు కూడా ఎవరెవరిని తీసుకుపోయారో వారి పేర్లు మొత్తం బయట పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఇల్లీగల్ వ్యాపారం చేసే వారిని అరెస్టు చేయాలని, చీకోటి ప్రవీణ్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Advertisement

Next Story